తెలుగు తొలిప్రొద్దు వెలుగులు
- శాసనాలలో తొలి తెలుగు పదం – నాగబు
- తొలి పూర్తి తెలుగు శాసనం – రేనాటి చోడులది
- తొలి తెలుగు కవి – నన్నయ
- తొలి తెలుగు కావ్యం – ఆంధ్రమహాభారతం
- తొలి తెలుగు నిర్వచన కావ్యం – నిర్వచనోత్తర రామాయణము
- తొలి తెలుగు ప్రబంధము -మనుచరిత్రము
- తొలి తెలుగు నవల – రాజశేఖర చరిత్రము
- తొలి తెలుగు కవయిత్రి – తాళ్ళపాక తిమ్మక్క
- తొలి తెలుగు వ్యాకరణము – ఆంధ్రభాషాభూషణము
- తొలి తెలుగు గణిత గ్రంథము -గణితసార సంగ్రహము
- తొలి తెలుగు ఛందశ్శాస్త్రము – కవి జనాశ్రయము
- తొలి తెలుగు శతకము – వృషాధిప శతకము
- తొలి తెలుగు నాటకము – మంజరీ మధుకీయము
- తొలి తెలుగు శృంగారకవయిత్రి – ముద్దుపళని
- తొలి తెలుగు కథానిక – దిద్దుబాటు
- తొలి తెలుగు దృష్టాంతశతకము – భాస్కర శతకము
- తొలి తెలుగు రామాయణము – రంగనాథ రామాయణము
- తొలి తెలుగు ద్వ్యర్థికావ్యము – రాఘవ పాండవీయము
- తొలి తెలుగు జంటకవులు – నంది మల్లయ, ఘంట సింగన
- తొలి తెలుగు పురాణానువాదము -మార్కండేయ పురాణము
- తొలి తెలుగు ఉదాహరణకావ్యము – బసవోదాహరణము
- తొలి తెలుగు పత్రిక – సత్యదూత
- తొలి తెలుగు నీతి శతకము – సుమతీ శతకము
- తొలి తెలుగు సాంఘిక నాటకము – నందకరాజ్యం
- తొలి తెలుగు వాగ్గేయకారుడు – అన్నమయ్య
- తొలి తెలుగు ద్విపదకవి – పాల్కురికి సోమన
- తొలి తెలుగు పద్యం (శాసనాలలో) – తరువోజ
- తొలి తెలుగు పద్యశాసనము – అద్దంకి శాసనము
- తొలి తెలుగు ధర్మశాస్త్రము – విజ్ఙానేశ్వరీయము
- తొలి తెలుగు పరిశోధనా వాఙ్మయ గ్రంథము – సకల నీతి సమ్మతము
- తొలి తెలుగు వ్యావహారిక నాటకము – కన్యాశుల్కం
- తొలి తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి – ఆంధ్రుల సాంఘిక చరిత్ర
ఊసులాడే ఒక జాబిలమ్మ...